కేతకీలో భక్తుల సందడి | - | Sakshi
Sakshi News home page

కేతకీలో భక్తుల సందడి

Aug 4 2025 5:12 AM | Updated on Aug 4 2025 5:12 AM

కేతకీ

కేతకీలో భక్తుల సందడి

బోనం.. వైభవం
ప్రభుత్వ భూమిని కాపాడండి

ఝరాసంగం(జహీరాబాద్‌): కేతకీ సంగమేశ్వర ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం సెలవు రోజు కావటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ఆవరణలోని అమృత గుండంలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించి, గుండంలోని జలలింగానికి పూజలు చేశారు. అనంతరం గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులను ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శించుకున్నారు.

వెల్దుర్తి(తూప్రాన్‌): మండలంలోని ఎం.జలాల్‌పూర్‌ శివారులోని కాళికామాత దేవాలయం వద్ద శ్రావణమాసాన్ని పురస్కరించుకొని ఆదివారం బోనాలు ఊరేగింపు ఘనంగా చేపట్టారు. ఉదయం నుంచే వేద పండితులు హోమం, అర్చనలు, అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ సుహాసినిరెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజిరెడ్డితో పాటు పలువురు వేర్వేరుగా ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కౌడిపల్లి(నర్సాపూర్‌): ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతూ 765డీ జాతీయ రహదారిపై వెల్మకన్న గ్రామస్తులు ఆదివారం రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామ శివారులోని సర్వే నంబర్‌ 447లో ప్రభుత్వ భూమిని కౌడిపల్లికి చెందిన వ్యక్తి అసైన్డ్‌ ల్యాండ్‌ పేరిట కబ్జా చేస్తు న్నాడని ఆరోపించారు. ఈవిషయమై మండల, డివిజన్‌, జిల్లా రెవెన్యూ అధికారులతో పాటు హైదరాబాద్‌ సీసీఎల్‌లో సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధుల అండతో కబ్జాకు పాల్పడుతున్నాడని వాపోయా రు. రాస్తారోకోతో పెద్ద ఎత్తున వాహనా లు నిలిచిపోయాయి. ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి గ్రామస్తులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశా రు. అనంతరం గ్రామస్తులు ఎస్‌ఐకి ఫిర్యాదు చేశారు.

కేతకీలో భక్తుల సందడి1
1/3

కేతకీలో భక్తుల సందడి

కేతకీలో భక్తుల సందడి2
2/3

కేతకీలో భక్తుల సందడి

కేతకీలో భక్తుల సందడి3
3/3

కేతకీలో భక్తుల సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement