
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి
ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: బీసీ రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పించాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం ఉలుకు పలుకు లేని విధంగా వ్యవహరిస్తోందన్నారు. ఇదే విషయమై ఈనెల 5న పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వనుండగా, రాష్ట్రం నుంచి నాయకులు, ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాలతో 6న ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ధర్నా, 7న రాష్ట్రపతికి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. జంతర్ మంతర్ వద్ద ధర్నాకు నియోజకవర్గం నుంచి 20 మంది కార్యకర్తలు తరలివెళ్లనున్నారని వివరించారు.
గెస్ట్ లెక్చరర్లకు ఆహ్వానం
జోగిపేట(అందోల్): జోగిపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ వాణి తెలిపారు. సీఎంఈ పోస్టులు 5, ఈసీఈ 4, ఇంగ్లీష్ 1, గణితం 2, ఫిజిక్స్ 2, కెమిస్ట్రీ 2 మొత్తం 16 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిగ్రీ, పీజీ అర్హత కలిగి ఉండాలని, ఇంటర్వ్యూ తేదీని అభ్యర్థులకు తెలియజేస్తామన్నారు. అలాగే ఈనెల 5, 6 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామన్నారు. సీఎస్‌ఈ, ఈసీఈ కోర్సులకు సంబంధించి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
నవోదయ దరఖాస్తు
గడువు పొడిగింపు
న్యాల్‌కల్(జహీరాబాద్): వర్గల్‌లోని నవోదయ విద్యాలయంలో 2026– 2027 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 13 వరకు పొడిగించినట్లు ఎంఈఓ మారుతి రాథోడ్ తెలిపారు. గత నెల 29తో గడువు ము గిసినప్పటికీ విద్యార్థుల సౌకర్యార్థం పొడిగించినట్లు చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల లేదా ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలలో ప్రస్తుతం 5వ తరగతి చదువుతూ ఉండాలన్నారు. ఆసక్తి గల విద్యార్థులను వెంటనే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఏడుపాయలలో
భక్తుల సందడి
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల పుణ్యక్షేత్రం ఆదివారం వేలాది భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు చర్యలు తీసుకున్నారు.
ఆ ఉద్యోగుల తొలగింపు
సరికాదు: సీఐటీయూ
మెదక్ కలెక్టరేట్: కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు వెంటనే నిలిపివేసి, వారికి రావా ల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్‌లో ఆయన మాట్లాడారు. 36 ప్రభుత్వ శాఖల్లో 90 వేల మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నట్లు తెలిపారు. వీరిని రెన్యూవల్ చేయకుండా దాదాపు 4,500 మందిని ప్రభుత్వం పక్కన పెట్టడం దారుణం అన్నారు. వారికి నాలుగు నెలల నుంచి వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తుందని మండిపడ్డారు.
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి: ఎస్‌ఎఫ్‌ఐ
జోగిపేట(అందోల్): జిల్లావ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు మహేశ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లా డుతూ.. జోగిపేట ఎస్సీ మహిళా కాలేజీ హాస్టల్‌కు తక్షణమే నూతన భవనం ఏర్పాటు చే యాలని, స్కూల్, కళాశాల హాస్టల్ రెండు ఒకే దగ్గర ఉండడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బాలికల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు.

బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి