
కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కరపత్రం విడుదల చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేటి నుంచి మూడు రోజుల పాటు ప్రతి ఇంటికి కరపత్రాన్ని అందజేసి వారి సమస్యలను సేకరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. గత 10 ఏళ్ల బీఆర్‌ఎస్ అవినీతిని సైతం ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దోమల విజయకుమార్, నాయకులు వాసు, గిరిధర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్, పవన్, గురునాథ్, గోవింద్, బాబా, చారి తదితరులు పాల్గొన్నారు. అలాగే కొండాపూర్ మండల పరిఽ దిలోని మారేపల్లిలో మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు.
బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి