
అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకోం
హత్నూర(సంగారెడ్డి): కాంగ్రెస్ పాలనలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేని బీఆర్‌ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ రాష్ట్ర మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి ఎంఏ హకీం హెచ్చరించారు. ఆదివారం హత్నూరలో విలేకరులతో మాట్లాడారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఏ ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ 18 నెలల పాలనలో అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందిస్తుంటే జీర్ణించుకోవడం లేదన్నారు. అధికారిక కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తే ఎమ్మెల్యే సునీతారెడ్డి ఎందుకు అభ్యంతరం చెప్పా రని ప్రశ్నించారు. ఊసరవెల్లి రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణ, జిల్లా మాజీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుజాత, ఆత్మ కమిటీ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ వీరస్వామిగౌడ్, కాంగ్రెస్ నాయకులు సత్యం, రియాజ్, పెంటయ్య, మణిదీప్, లక్ష్మీనారాయణ, సాయి, పెంకటేశ్, అబ్దుల్ ఖదీర్, ఆంజనేయులు, నర్సింలు, రాములు, సదా శివులు పాల్గొన్నారు.