
పాలిటెక్నిక్‌లో స్పాట్ అడ్మిషన్లు
హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిన్నట్లు ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు. ఈ నెల 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాలేజీలో ఈఈఈ, సివిల్ బ్రాంచ్‌లో మిగులు సీట్లకు విద్యార్థుల మెరిట్ ప్రతిపాదికన సీట్లు 11వ తేదీన కేటాయించనున్నట్లు చెప్పారు. 2025 పాలీసెట్‌కు హాజరు కాని విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
‘బాలకథా చంద్రిక’ పుస్తకావిష్కరణ
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రముఖ బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం రచించిన ‘బాలకథా చంద్రిక’ బాలల కథల పుస్తకావిష్కరణ సభ ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చందమామ కథా రచయిత మాచిరాజు కామేశ్వరరావు చేతుల మీదుగా ఆవిష్కరించినట్లు జాతీయ సాహిత్య పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఎన్నవెళ్లి రాజమౌళి తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చొక్కాపు వెంకటరమణ, రచయితలు పైడిమర్రి రామకృష్ణ, చంద్రప్రతాప్, ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి, బూర్ల నాగేశ్వరరావు, పుప్పాల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు. ఉండ్రాళ్లరాజేశం బాలల కోసం గేయాలు, కథలు, పద్యాలు తదితర రచనలతో చేసిన బాలసాహిత్య కృషిని కొనియాడారని పేర్కొన్నారు.
బాలసాహిత్య
పురస్కారాలు ప్రదానం
ప్రశాంత్‌నగర్ / చిన్నకోడూరు (సిద్దిపేట): జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బక్రిచెప్యాలలో 10వ తరగతి చదువుతున్న జక్కుల లోహితకు ప్రథమ బహుమతి లభించిందని పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు వరుకోలు లక్ష్మయ్య తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో మాచిరాజు బాలసాహిత్య పీఠం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బాలల కథల పోటీల్లో 541 కథల్లో లోహిత రాసిన ఽ‘‘ధూమపానం’’ కథ ప్రథమ బహుమతి పొందిందని పేర్కొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పత్తిపాక మోహన్ చేతుల మీదుగా లోహిత బహుమతి, మాచిరాజు బాలసాహిత్య పురస్కారం అందుకున్నారని చెప్పారు. కాగా, చిన్న కోడూరు మండలంలోని అనంత సాగర్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని అఖిల కూడా మాచిరాజు బాల సాహిత్య పురస్కారం అందుకున్నదని ఉపాధ్యాయుడు దుర్గయ్య తెలిపారు.
అథ్లెటిక్స్‌లో
ప్రతిభ చాటిన క్రీడాకారులు
సిద్దిపేట జోన్: హన్మకొండలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి సీనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో సిద్దిపేటకు పతకాలు లభించాయి. అండర్ 20 విభాగంలో రేస్ వాక్‌లో గణేశ్ బంగారు పతకం సాధించగా, అండర్ – 16 బాలికల విభాగంలో సిరి చందన జావెలిన్ త్రోలో వెండి పతకం సాధించింది. ఈ సందర్భంగా వారిని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పరమేశ్వర్, ప్రధాన కార్యదర్శి వెంకట్ స్వామి అభినందించారు.
ఆలయంలో
ఫ్రెండ్‌షిప్‌డే వేడుకలు
నర్సాపూర్ రూరల్: మండలంలోని లింగాపూర్ దట్టమైన అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ గండబేరుండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆవరణలో నిత్య జీవన యోగాసాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించారు. యోగా గురువులు బాసంపల్లి సురేందర్ గౌడ్, సంతోష్ ఆధ్వర్యంలో నిత్యం యోగా సాధన చేసే వారంతా కలిసి ముందుగా స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం యోగా సాధన చేసి రోజంతా కబుర్లు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజు యాదవ్, హనుమంత్ గుప్తా, భిక్షపతి రెడ్డి, జైపాల్ పాల్గొన్నారు.

పాలిటెక్నిక్‌లో స్పాట్ అడ్మిషన్లు

పాలిటెక్నిక్‌లో స్పాట్ అడ్మిషన్లు

పాలిటెక్నిక్‌లో స్పాట్ అడ్మిషన్లు

పాలిటెక్నిక్‌లో స్పాట్ అడ్మిషన్లు