
నిశ్చితార్థం వేడుకకు వెళ్లి.. అనంతలోకాలకు..
భువనగిరి: భువనగిరి పట్టణంలోని జగదేవ్‌పూర్ చౌరస్తాలో లారీ బీభత్సం సృష్టించింది. లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందగా.. ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పోతిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన చిలమామిడి రామకృష్ణ(35), చిలమామిడి సాయి కుమార్(22) హైదరాబాద్‌లోని సూరారం కాలనీలో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. రామకృష్ణ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా, సాయికుమార్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం భువనగిరి పట్టణంలోని సంతోష్‌నగర్‌లో నిశ్చితార్థం వేడుకకు బంధువులతో కలిసి వచ్చారు. ఈ క్రమంలో స్వీట్స్ కోసం రామకృష్ణ, సాయికుమార్ ఇద్దరూ కారులో పట్టణంలోని జగదేవ్‌పూర్ చౌరస్తాకు బయలుదేరారు. కారును రోడ్డు పక్కన పార్కింగ్ చేసి షాపు దగ్గరకు వెళ్తున్నారు. ఇదే సమయంలో రాజస్థాన్‌కు చెందిన లారీ ఉత్తరప్రదేశ్ నుంచి జగదేవ్‌పూర్ మీదుగా చైన్నెకి వెళ్తూ వేగంగా దూసుకువచ్చి అక్కడే ఉన్న పాదచారులు, ద్విచకవ్రాహనదారులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందగా, సాయికుమార్‌తో పాటు రామన్నపేట మండలం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన బీమారి శివసాయికుమార్, లారీ డ్రైవర్, క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం సాయికుమార్‌తో పాటు శివసాయికుమార్‌ను సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సాయికుమార్ మృతి చెందాడు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రామకృష్ణకు భార్య ఇద్దరు కుమార్తెలు, సాయికుమార్‌కు భార్య, కుమార్తె ఉన్నారు.
ధ్వంసమైన షాపులు, బైకులు
లారీ వేగంగా దూసుకురావడంతో రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్, పాన్‌షాప్‌లు, అక్కడే ఉన్న మూడు బైకులు ధ్వంసమయ్యాయి. మృతుడు రామకృష్ణ లారీ, గోడ మధ్యన ఇరుక్కుపోవడంతో పోలీసులు క్రేన్ సాయంతో లారీని తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
ద్విచక్రవాహనదారులు,
పాదచారులపైకి దూసుకువచ్చిన లారీ
ఇద్దరి మృతి, ఒకరికి గాయాలు

నిశ్చితార్థం వేడుకకు వెళ్లి.. అనంతలోకాలకు..

నిశ్చితార్థం వేడుకకు వెళ్లి.. అనంతలోకాలకు..