
వికసించిన కదంబ వనవాసిని పుష్పాలు
గుండ్రంగా బంతిలా వికసిస్తూ కనిపిస్తున్న కదంబ వనవాసిని పుష్పాలను తిలకించిన ప్రతి ఒక్కరూ అబ్బుర పడుతున్నారు. సుతిమెత్తగా, సుకుమారంగా వికసించే ఈ పుష్పాలు కంటికి ఇంపుగా కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంత వాసులకు అంతగా పరిచయం లేని ఈ చెట్లు ఎక్కువగా వారణాసిలోని కాశీ, మధురై, త్రిపురాంతకంలో ఎక్కువగా కనిపిస్తాయి. గత హరితహారంలో రోడ్లకిరువైపులా నాటిన కదంబ మొక్కలు ప్రస్తుతం ఏపుగా ఎదిగి పుష్పిస్తున్నాయి. ఏడాదిలో ఆషాఢమాసంలో పుష్పించడం వల్ల పార్వతీదేవి అమ్మవారికి ఈ పుష్పాలు ప్రీతిపాత్రమైనవిగా చెప్పుకుంటారు. అమ్మవారికి ఒక్క పుష్పంతో పూజిస్తే 108 పువ్వులతో పూజించినట్టేనని నమ్ముతారు.
– మిరుదొడ్డి(దుబ్బాక):

వికసించిన కదంబ వనవాసిని పుష్పాలు

వికసించిన కదంబ వనవాసిని పుష్పాలు