విశ్వశాంతి కోసం వీరశైవుల పాదయాత్ర | - | Sakshi
Sakshi News home page

విశ్వశాంతి కోసం వీరశైవుల పాదయాత్ర

Aug 4 2025 5:12 AM | Updated on Aug 4 2025 5:18 AM

విశ్వశాంతి కోసం వీరశైవుల పాదయాత్ర

విశ్వశాంతి కోసం వీరశైవుల పాదయాత్ర

పటాన్‌చెరు: విశ్వశాంతి కోసం వీరశైవ సమాజం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పాదయాత్ర చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్‌చెరు వీరశైవ సమాజం ఆధ్వర్యంలో పట్టణంలోని ఉమామహేశ్వర దేవాలయం నుంచి బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయం వరకు చేపట్టిన 18వ మహా పాదయాత్రను ఆదివారం ఉదయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... 12వ శతాబ్దంలో అభ్యుదయ సమాజం కోసం కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా బసవేశ్వరుడి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషమన్నారు. నియోజకవర్గంలోని వీరశైవుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం కార్పొరేటర్‌ పుష్ప నగేశ్‌, సమాజం ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రారంభించిన

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement