
చోరీ కేసులో నిందితుడి అరెస్టు
దుబ్బాక: పట్టణంలో రెండు దుకాణాల్లో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డ నిందితుడిని 24 గంటల్లోనే పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ కీర్తిరాజు కేసు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లో మైబైల్ షాపు, పెయింటింగ్ షాపుల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనను పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. చోరీ ఘటనపై ఏసీపీ రవీందర్‌రెడ్డి, దుబ్బాక సీఐ శ్రీనివాస్ సూచనల మేరకు ఆ ప్రాంతంలోని నిఘానేత్రాలను పరిశీలించగా పట్టణానికి చెందిన చెక్కపల్లి శివగా గుర్తించారు. ఆదివారం ఉదయం బస్టాండ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిందితుడు శివను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. అతడి వద్ద చోరీ చేసిన 10 సెల్‌ఫోన్లు,1500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించారు. కాగా చోరీ ఘటనను 24 గంటల్లోనే ఛేదించిన దుబ్బాక ఎస్‌ఐ కీర్తిరాజు, పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.
సెల్‌ఫోన్లు, నగదు స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఎస్‌ఐ కీర్తిరాజు