
ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
కొండాపూర్(సంగారెడ్డి): పట్టాలిచ్చిన అందరికీ వెంటనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి పేదలను ఆదుకోవాలని ిసీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సీపీఎం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని గంగారంలో పర్యటించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గంగారంలో సర్వే నం.1, 5, 243లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పట్టాలిచ్చారన్నారు. కానీ ఇళ్లు కట్టుకునేందుకు పర్మిషన్ అడిగితే ఇవ్వకుండా పంచాయతీ కార్యదర్శి ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి రాజయ్య, మండల కమిటీ సభ్యులు బాబురావు, ప్రవీణ్, గ్రామ నాయకులు అనిల్, సొలోమోన్, కృష్ణ, యువాన్, అర్జున్, గంగమ్మ, ఆంజనేయులు, ఏసమ్మ, సురేశ్, బాలమణి, ప్రశాంత్, సంజీవ్ పాల్గొన్నారు.
గంగారంలో పర్యటించిన
సీపీఎం నాయకులు