సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి కృషి

Aug 4 2025 5:12 AM | Updated on Aug 4 2025 5:18 AM

సమస్యల పరిష్కారానికి కృషి

సమస్యల పరిష్కారానికి కృషి

పటాన్‌చెరు టౌన్‌: సంఘటిత, అసంఘటిత కార్మికుల హక్కుల సాధనకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు నరసింహా రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్‌చెరు డివిజన్‌ పరిధిలోని బ్లాక్‌ ఆఫీస్‌లో కార్మిక సంఘం నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ...త్వరలోనే భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర, జిల్లా కమిటీలను నియమిస్తామని తెలిపారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న నరసింహారెడ్డిని కార్మిక సంఘం నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏషియన్‌ పెయింట్స్‌ ఐఎన్‌టీయూసీ అమర్‌ సింహారెడ్డి, ఆంటోనీ, శ్రీధర్‌, కరుణాకర్‌ రెడ్డి, వెంకట్‌ రెడ్డి, మహేశ్‌, కిష్టయ్య, నాగరాజు గౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement