
మల్లన్న పైపులైన్ పూర్తవడంతో సంబరాలు
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటాపోటీగా జలాభిషేకాలు
గజ్వేల్ : స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ...గజ్వేల్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలతో ముందుకుసాగుతున్నాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి గజ్వేల్‌కు రూ.210కోట్లతో చేపట్టిన ప్రత్యేక మిషన్ భగీరథ పైపులైన్ పనులు పూర్తయి మంచినీటి సరఫరా ప్రారంభమైంది. శనివారం రెండు పార్టీలు జలాభిషేకాలు నిర్వహించాయి. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు గజ్వేల్ మండలం కోమటిబండ గుట్టపై ఉన్న మిషన్ భగీరథ హెడ్‌వర్క్స్ వద్ద సీఎం రేవంత్ చిత్రపటానికి జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ సీఎం చొరవ వల్లే గజ్వేల్‌కు మల్లన్నసాగర్ నుంచి మిషన్ భగీరథ ప్రత్యేక పైపులైన్ వచ్చిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కృషివల్లే గజ్వేల్‌కు మిషన్ భగీరథ నీరు వచ్చిందని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ గజ్వేల్‌లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేసీఆర్ చిత్రపటానికి జలాభిషేకం చేశారు.

మల్లన్న పైపులైన్ పూర్తవడంతో సంబరాలు