
సమస్యలు పరిష్కరించకపోతే ముట్టడే
పటాన్‌చెరు: స్థానిక ప్రజా ప్రతినిధులు ఇప్పటికై నా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, లేనిపక్షంలో మున్సిపల్ ఆఫీస్‌ను ముట్టడిస్తామని జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి హెచ్చరించారు. అమీన్‌పూర్‌లోని పటేల్‌గూడా, కృష్ణారెడ్డిపేట్ పరిధిలో కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ధర్నాలో గోదావరి, పటాన్‌చెరు అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్‌గుప్తా పాల్గొని మాట్లాడారు. ఇన్ని రోజులు ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు, అధికారులు దోచుకున్న సొమ్మును కక్కించే బాధ్యత బీజేపీ తీసుకుంటుందన్నారు. అమీన్‌పూర్ బీజేపీ మండల అధ్యక్షుడు ఈర్ల రాజు ముదిరాజ్ మాట్లాడుతూ..మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి సహకారంతో ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తునామన్నారు. కృష్ణారెడ్డి పేట గ్రామ పరిధిలోని దుర్గానగర్ కాలనీకి కలెక్టర్ పార్కుకోసం స్థలాన్ని కేటాయిస్తే కొందరు నాయకుల కారణంగా అది ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. పటేల్‌గూడ గ్రామంలో కూడా వివిధ కాలనీలలో రోడ్లు అభివృద్ధికి నోచుకోలేదని ప్రజలు నరకయాతన పడుతున్నారని రోడ్ల సమస్యల పరిష్కారానికి కాలనీ అసోసియేషన్‌ల నుంచి అధికార పార్టీ నాయకులు డబ్బులను డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ జిల్లా
అధ్యక్షురాలు గోదావరి