
జనరహిత పాదయాత్ర
మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఎద్దేవా
జోగిపేట(అందోల్): కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్రలో జనరహితంగా సాగిందని అందోలు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఎద్దేవా చేశారు. శనివారం అందోల్‌లోని ఒక ఫంక్షన్ హాలులో స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఏఐసీసీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ గానీ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో ఇప్పటి వరకు స్పష్టం చేయలేదన్నారు. పాదయాత్రలో కనీసం ప్రజా సమస్యలు వినలేకపోయారని విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలులో ప్రజాప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిందన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్‌తో చంద్రబాబుకు తొత్తులుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు కోసం బీఆర్‌ఎస్ పార్టీ పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో పుల్కల్, టేక్మాల్ మండలాల పార్టీ అధ్యక్షులు మాచర్ల విజయ్ కమార్, వీరప్ప, అందోల్ మండల నాయకులు చాపల వెంకటేశం, నాగరత్నంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.