
తరగతి గదులు నిర్మించండి
సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): మండలంలోని నాగులపల్లి ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరుకుందని వెంటనే తరగతి గదులు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లుకు వారంతా శుక్రవారం వినతి పత్రాన్ని సమర్పించారు. పాఠశాలలోని విద్యార్థులకు కనీస టాయిలెట్ సౌకర్యం కూడా లేదని, పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఈ సందర్భంగా డీఈఓ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..ఈ సమస్యపై కలెక్టర్‌కు నివేదిక అందజేస్తానని తెలిపారు.