
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు
సంగారెడ్డి జోన్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలని మల్టీజోన్–2 ఇన్‌చార్జి ఐజీ తఫ్సిల్ ఇక్బాల్ పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. కార్యాలయ ఆవరణలో ఎస్పీ పరితోశ్ పంకజ్‌తో కలిసి మొక్కలను నాటి నీరు పోశారు. అనంతరం పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పొరుగు రాష్ట్రాల నుంచి నిషేధిత గంజాయి, పొగాకు, గుట్కా వంటివి అక్రమ రవాణ జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర సరిహద్దులో పకడ్బందీగా వాహనాల తనిఖీ చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు, డీటీసీ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీలు ప్రభాకర్, సైదానాయక్, వెంకట్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి కల్యాణి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
మల్ట్టీజోన్–2 ఇన్‌చార్జి ఐజీ తఫ్సిల్ ఇక్బాల్