
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
జిన్నారం(పటాన్‌చెరు): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని ఆ పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి ధీమావ్యక్తం చేశారు. బుధవారం బొల్లారం పట్టణ అధ్యక్షుడు ఆనంద్‌కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక యువకులు భారీ సంఖ్యలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిఽథిగా హాజరై కాషాయ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గోదావరి మాట్లాడుతూ... ప్రధాని మోదీ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల పోరుకు ప్రతిఒక్కరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు రవీందర్‌రెడ్డి, మహిళా మోర్చ ప్రధాన కార్యదర్శి మేఘన రెడ్డి, నాయకులు అఖిల్, శ్రీకాంత్ చారి, అరుణ్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి