
వసతి గృహాల తనిఖీ
హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని సర్ధన, బూర్గుపల్లి గ్రామాల్లోని బాలుర వసతి గృహాలను బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి జగదీశ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో ఉన్న విద్యార్థులతో మాట్లాడి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహాల్లో పరిశుభ్రత పాటించి విద్యార్థులు అనారోగ్యానికి గురి కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వంటగది, భోజనశాల, స్టోర్‌రూమ్‌లను హాస్టల్‌కు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. ఆయన వెంట అసిస్టెంట్ బీసీ సంక్షేమ అధికారి గంగకిషన్, వసతి గృహ సంక్షేమ అధికారులు ఉమ, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.