
అర్థమయ్యేలా బోధించాలి
జిల్లా విద్యాశాఖ పరిశీలకులు కృష్ణారావు
కొండపాక(గజ్వేల్): విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని జిల్లా విద్యాశాఖ పరిశీలకులు, రాష్ట్ర ఎగ్జామినేషనల్ డైరెక్టర్ కృష్ణారావు ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం కొండపాక మండలంలోని దుద్దెడలో జరుగుతున్న కాంప్లెక్స్ సమావేశంలో పాల్గొని ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. అలాగే కొండపాకలోని ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కోవాలని విద్యార్థులకు సూచించారు. గ్రంథాలయంలో విలువైన పుస్తకాలుంటాయని, వాటిని చదువడం వల్ల మేథోసంపత్తి పెరుగుతుందన్నారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సెల్‌ఫోన్‌లకు దూరంగా ఉండేలా, పుస్తక పఠనం చేసేలా ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌వో రంగనాథస్వామి, సీఆర్‌సీ హెచ్‌ఎం లక్ష్మి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.