
కాపురం కోసమే అత్తను హతమార్చాడు
మద్దూరు(హుస్నాబాద్): అత్త చెప్పిన మాటలు విని భార్య కాపురానికి రావడం లేదనే అనుమానంతో అత్తను అల్లుడు, అతడి తమ్ముడు కత్తితో నరికి చంపిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో హుస్నాబాద్ ఏసీపీ సదానందం కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని మర్మాముల గ్రామ శివారులోని బంజేరుకు చెందిన జంగిలి వజ్రమ్మ(55)ను అల్లుడు జక్కుల మహేష్, అతడి తమ్ముడు హరీశ్‌తో కలిసి హత్య చేసిన విషయం తెలిసిందే. అత్తను చంపి కాపురం బాగు చేసుకోవచ్చని నిర్ణయించుకుని అన్నదమ్ములిద్దరూ కలిసి కమ్మకత్తి తీసుకొని అత్త గ్రామమైన బంజేరుకు వెళ్లారు. అక్కడ అత్తతో మాట్లాడుతున్నట్లు నమ్మించి మహేశ్ కత్తితో నరకగా బలమైన గాయాలై ఆమె అక్కడికక్కడే చనిపోయింది. నిందితులను రిమాండ్‌కు తరలించారు. వారు ఉపయోగించిన కమ్మకత్తితో పాటు ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మాట్లాడినట్టు నమ్మించి కత్తితో నరికారు
అల్లుడు, అతని తమ్ముడు రిమాండ్
వివరాలు వెల్లడించిన ఏసీపీ