
స్మార్ట్ వాకింగ్ స్టిక్ ఆవిష్కరణ
దుబ్బాకటౌన్: ఢిల్లీలో సిద్దిపేట జిల్లా విద్యార్థులు స్మార్ట్ వాకింగ్ స్టిక్‌ను ఆవిష్కరించి మంగళవారం ప్రదర్శించారని ప్రధానోపాధ్యాయుడు అంజిరెడ్డి తెలిపారు. రాయపోల్ మండలం బేగంపేట ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు యం.హర్షవర్ధన్, పి.కార్తీక, యం.చైతన్య, గైడ్, టీచర్ కె.భాస్కర్ రెడ్డి మార్గదర్శకత్వంలో ‘స్మార్ట్ వాకింగ్ స్టిక్‘ను తయారు చేశారని చెప్పారు. స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ –2025లో భాగంగా.. గత డిసెంబర్ 2024లో జాతీయ స్థాయిలో లక్షా ఐదువేల వైజ్ఞానిక ప్రాజెక్టులు ఆన్‌లైన్‌లో ప్రదర్శించగా ఉత్తమమైన 27 ఆవిష్కరణలను ప్రకటించారన్నారు. వాటిలో బేగంపేట విద్యార్థుల ఆవిష్కరణ జాతీయ స్థాయికి ఎంపికై ందని తెలిపారు. నేటి నుంచి జులై 31 వరకు న్యూ ఢిల్లీలోని గాల్గోటియాస్ యూనివర్సిటీలో ప్రదర్శిస్తున్నారని చెప్పారు. కాగా విద్యార్థులను జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్, ఉపాధ్యాయులు అభినందించారు.