
స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా ఆర్డీఓ పాండు
జోగిపేట(అందోల్): అందోల్– జోగిపేట ఆర్డీఓ పాండుకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో సుమారుగా 40 మందికి పైగా ఆర్డీవోలుగా ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఏడాదిన్నర కాలంగా అందోల్–జోగిపేట ఆర్డీఓగా పాండు పనిచేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు.
జిన్నారం మున్సిపాలిటీ
గెజిట్ విడుదల
జిన్నారం (పటాన్‌చెరు): జిన్నారం మండలాన్ని మున్సిపాలిటీగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభు త్వం తాజాగా గెజిట్ విడుదల చేసింది. ఈ మేరకు అండూర్, శివానగర్, సోలక్‌పల్లి, రాళ్లకత్వ, ఊట్ల, కొడకంచి, నల్లూర్, మంగంపేట, జంగంపేట, పంచాయతీలను కలుపుతూ జిన్నారం మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. కాగా ఇకనుంచి గ్రామపంచాయతీ పాలన నుంచి మున్సిపల్ పాలన కొనసాగనుంది.