
అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
సంగారెడ్డి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. అందోల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో మంత్రి దామోదర మంగళవారం సంగారెడ్డిలోని తన నివాసంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, అందోల్ నియోజక వర్గంలోని కాంగ్రెస్ పార్టీ తొమ్మిది మండలాల అధ్యక్షులు, ఆత్మ కమిటీల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, నాయకులు పాల్గొన్నారు.
వన దుర్గమ్మ సేవలోఆర్టీఐ కార్యదర్శులు
పాపన్నపేట(మెదక్): సమాచార హక్కు చట్టం కార్యదర్శులు మంగళవారం ఏడుపాయల వన దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆర్టీఐ కార్యదర్శి రాములు, డిప్యుటీ కార్యదర్శి ప్రమీల, సభ్యులు ఉదయం ఏడుపాయలకు రాగా వారికి సిబ్బంది ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. అర్చకులు శంకరశర్మ,పార్థివ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, ఆర్టీఐ అధికారులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వారిని శాలువాలతో సత్కరించారు.
లైసెన్ ్డ్స సర్వేయర్ల
ప్రాక్టికల్ పరీక్ష ప్రశాంతం
సంగారెడ్డి జోన్: జిల్లాలో లైసెన్ ్డ్స సర్వేయర్ల నియామకం ప్రక్రియ కొనసాగుతోంది. పట్టణంలోని తారా డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసింది. 160 మంది అభ్యర్థులకు గాను 127 మంది అభ్యర్థులు హాజరుకాగా 33 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. అదనపు కలెక్టర్ మాధురి పరీక్షాకేంద్రాన్ని తనిఖీ చేశారు.
ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో
రిజర్వేషన్ కల్పించాలి
గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా
అధ్యక్షుడు జైపాల్ నాయక్
మెదక్ కలెక్టరేట్: పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో రిజర్వేషన్ కల్పించాలని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014కు పూర్వం సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో గిరిజనులకు 6% లభించే రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10% పెరిగినట్లు తెలిపారు. రాష్ట్ర గిరిజన జనాభాలో 70% మైదాన ప్రాంతాలైన మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, హైదరాబాద్‌లో గిరిజనులకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలన్నారు.
ఓడీఎఫ్‌లో సమస్యలు తీర్చాలి
కంది(సంగారెడ్డి): ఎద్దు మైలారం అయిద కర్మగారం(ఓడీఎఫ్)లో వర్క్‌లోడ్ సమస్యను తీర్చాలని బీఎంఎస్, ఓఎఫ్‌ఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో ఎంపీ రఘునందన్‌రావు ఆధ్వర్యంలో రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓడీఎఫ్‌లో వర్క్‌లోడ్ లేక ఉద్యోగులు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమి, రైల్వే, సోలార్ తదితర సౌకర్యాలు ఓడీఎఫ్‌లో ఉన్నాయని తెలిపారు. ఓడీఎఫ్‌కు బీఎంపీ 3 వర్షన్ వర్క్‌లోడ్ కల్పించాలన్నారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి