
గోవా మద్యం బాటిళ్ల స్వాధీనం
జహీరాబాద్ టౌన్ / మునిపల్లి(అందోల్): గోవా నుంచి అక్రమంగా తీసుకువస్తున్న మద్యం బాటిళ్లను జిల్లా టాస్క్‌ఫోర్స్(డీటీఎఫ్) టీం సభ్యు లు పట్టుకున్నారు. సోమవారం మండలంలోని చిరాగ్‌పల్లి చెక్‌పోస్టు వద్ద డీటీఎఫ్ సీఐ శంకర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందన యశ్వంత్‌రెడ్డి తన కారులో వివిధ బ్రాండ్స్‌కు చెందిన 162 మద్యం బాటిళ్లు తీసుకొస్తుండగా పట్టుకున్నారు. అతడ్ని అరెస్టు చేసి మద్యం బాటిళ్లతో పాటు కారును స్వాధీనం చేసుకుని ఎకై ్సజ్ స్టేషన్‌కు తరలించారు. తనిఖీల్లో ఎస్‌ఐలు హనుమంతు, అనుదీప్, రామేష్, మురళీ, ఉమారాణి ఉన్నారు.