
మర్కుక్(గజ్వేల్): సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం వర్దరాజ్‌పూర్‌లోని వరదరాజుల స్వామి ఆలయంలో మాజీ సీఎం కేసీఆర్ సతీమణి శోభ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నీలాభూదేవి అమ్మవారి జన్మదినం పురస్కరించుకొని సోమవారం ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలను సమర్పించారు. శోభకు ఆలయ చైర్మన్ గోపాలకృష్ణ, పురోహితులు తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అప్పాల ప్రవీణ్, పురోహితులు పాల్గొన్నారు.