
తీర్థయాత్రలకు వెళ్లి.. తిరిగి రాని లోకాలకు..
చేర్యాల(సిద్దిపేట): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణ కేంద్రానికి చెందిన బొడ్డు గౌరీనాథ్‌కు ఇద్దరు కుమారులు, చిన్న కుమారుడు బొడ్డు భరత్(20)హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతూ హాస్టల్‌లో ఉంటున్నాడు. శుక్రవారం తన మిత్రులతో కలిసి కారులో అరుణాచలం వెళ్లాడు. అరుణాచలం గిరి ప్రదక్షిణ, దర్శనం అనంతరం అక్కడి నుంచి తిరుపతికి బయలుదేరారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్, చిత్తూరు సమీపంలోకి రాగానే కారు టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న భరత్ కారులో నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ భరత్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న మిగతా నలుగురు గాయపడగా వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. భరత్ మృతదేహం చిత్తూరు ఆస్పత్రిలో ఉంది. తాను ట్రైన్‌లో అరుణాచలం, తిరుపతికి వెళుతున్నానని, అమ్మానాన్నకి చెప్పిన భరత్ కారు ప్రమాదంలో మృతి చెందడంతో కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, మిత్రులు అంతా శోక సంద్రంలో మునిగిపోయారు.
బైక్ అదుపుతప్పి కిందపడటంతో..
జహీరాబాద్ టౌన్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని చిన్న హైదరాబాద్ గ్రామ శివారులో జరిగింది. రూరల్ ఎస్‌ఐ.కాశీనాథ్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన రేజింతల్ అంజన్న(34) మండలంలోని గోవింద్‌పూర్ వద్ద గల వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి పనులు ముగించుకుని ఇంటికి బైక్‌పై వస్తుండగా అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య నందిని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చిత్తూరు సమీపంలో జరిగిన రోడ్డు
ప్రమాదంలో చేర్యాల యువకుడు మృతి
నలుగురికి గాయాలు