
బీరప్పనా.. మజాకా..
జహీరాబాద్: మండలంలోని తూంకుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి బీరప్ప ఇటీవల సస్పెన్షన్‌కు గురయ్యాడు. కాగా మరో కార్యదర్శిని తీసుకువచ్చి కంప్యూటర్‌లో రికార్డులను తనిఖీ చేసే ప్రయత్నం చేయగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆదివారం బీరప్ప ఇతర ప్రాంతానికి చెందిన కార్యదర్శిని తీసుకొచ్చి పంచాయతీ రికార్డులను తారుమారు చేసే ప్రయత్నం చేశారని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామస్తులు కార్యదర్శులను అడ్డుకోవడంతో అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. ఈ విషయమై ఎంపీడీఓ మహేందర్‌రెడ్డిని వివరణ కోరగా తమకు సమాచారం ఇవ్వకుండా కార్యాలయానికి వెళ్లడం సరైంది కాదన్నారు. గ్రామస్తుల నుంచి సమాచారం అందగా వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించామన్నారు. తమకు రికార్డులను అప్పగించే వరకు వివరాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. హుగ్గెల్లి తండాకు చెందిన కార్యదర్శి సమతకు సోమవారం అదనపు బాధ్యతలు ఇచ్చినట్లు తెలిపారు. సస్పెన్షన్‌కు గురైన బీరప్ప మంగళవారం రికార్డులను తమకు సమర్పించనున్నట్లు వివరించారు.
సస్పెండైనా రికార్డుల తనిఖీ
అడ్డుకున్న గ్రామస్తులు

బీరప్పనా.. మజాకా..