
పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
సంగారెడ్డి ఎడ్యుకేషన్/పటాన్‌చెరు టౌన్: పోరాటాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు పేర్కొన్నారు. సమాజంలో దోపిడీ అణచివేత పోవాలన్నా, సమ సమాజం రావాలన్నా అది కేవలం మార్క్సిస్ట్ సిద్ధాంతం ద్వారానే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. సంగారెడ్డిలోని కేవల్‌కిషన్ భవన్‌లో సీపీఎం జిల్లా స్థాయి విసృతస్థాయి సమావేశంతోపాటు పటాన్‌చెరు పట్టణంలోని ఐలా భవన్‌లో జరిగిన కిర్బీ కార్మికుల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రపంచమంతా శాసీ్త్రయంగా అభివృద్ధి చెందుతుంటే మన దేశంలో మాత్రం మూఢాచారాల కు పెద్దపీట వేస్తూ బీజేపీ పాలన చేస్తోందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కులాలు, మతాల పేరిట విద్వేషాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు
చుక్కా రాములు