
వ్యాక్సిన్లు అందుబాటులో ఉండాలి
సిద్దిపేటకమాన్ : కుక్క, పాము కాటు సంబంధిత వ్యాక్సిన్ అందుబాటులో ఉంచుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. సిద్దిపేట కాలకుంట కాలనీలోని బస్తీ దవాఖానను డీఎంహెచ్‌ఓ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బస్తీ దవాఖానలో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. హై రిస్క్ ఉన్న గర్భిణుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు పూర్తిస్థాయిలో అందేలా చూడాలన్నారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని తెలిపారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్