
బైక్‌ను ఢీకొట్టిన క్రేన్ వాహనం
గజ్వేల్‌రూరల్: రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. ఈ ఘటన గజ్వేల్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం మల్లుపల్లికి చెందిన సయ్యద్ చాన్‌పాష స్టోన్ కట్టింగ్ పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం స్టోన్ కటింగ్ బ్లేడ్‌ను తీసుకువచ్చేందుకు మల్లుపల్లి నుంచి గజ్వేల్‌కు ద్విచక్ర వాహనంపై ఇదే గ్రామానికి చెందిన బానోత్ చందుతో కలిసి వచ్చాడు. తిరిగి బైక్‌పై వెళ్తుండగా మండల పరిధిలోని జాలిగామ గ్రామ శివారులో వెనుక నుంచి వచ్చిన క్రేన్ వాహనం ఢీకొట్టింది. క్షతగాత్రులను పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం రామాయంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో చాన్‌పాష మృతి చెందాడు. చాన్‌పాష మృతికి కారణమైన క్రేన్ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బైక్ పైనుంచి పడి యువకుడు..
చిన్నశంకరంపేట(మెదక్): ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి పడిన యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మిర్జాపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... గ్రామానికి చెందిన పోతరాజ్ కిషోర్‌కుమార్(35) ఈ నెల 15న మండల కేంద్రంలోని ప్యూయల్ స్టేషన్‌లో బైక్‌లో పెట్రోల్ పోసుకుని వెళుతుండగా అకస్మాత్తుగా కిందపడిపోయాడు. తలకు తీవ్రగాయం కావడంతో వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడికి భార్య నవనీత, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
వ్యక్తి మృతి