
హోటల్ సీజ్
కొమురవెల్లి(సిద్దిపేట): మండల కేంద్రంలోని హోటళ్లను గ్రామ పంచాయతీ కార్యదర్శి హరిప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బంది శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు హోటళ్లలో పరిశుభ్రత పాటించకుండా ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించి వారికి నోటీసులు జారీ చేశారు. పోలీస్ బొమ్మ చౌరస్తాలో గల రాజస్థాన్ హోటల్‌లో కుళ్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తుండటంతో సీజ్ చేశారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు విక్రయించవద్దని, అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రంమలో గ్రామపంచాయతీ సిబ్బంది కృష్ణ, మల్లేశం, శ్రీను,అరవింద్ పాల్గొన్నారు.
కుళ్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నందుకే..