
పేలుడు పదార్థాలు, ట్రాక్టర్ సీజ్
ముగ్గురిపై కేసు నమోదు
తూప్రాన్: అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలతో బండరాళ్లు పేల్చుతున్న ట్రాక్టర్‌ను సీజ్ చేసి ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ శివానందం వివరాల ప్రకారం... మండలంలోని గుండ్రెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని గౌడిగూడెంకు చెందిన రాంచంద్రారెడ్డికి చెందిన వ్యవసాయ పొలంలో అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలతో బండరాళ్లు పేల్చుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి పేలుడు పదార్థాలు, ట్రాక్టర్‌తో పాటు పేలుళ్లకు పాల్పడుతున్న భిక్షపతి, బొల్లబోయిన నర్సింలు, అంబపురం రాజులపై కేసు నమోదు చేశారు.