
ఆయిల్‌పామ్‌తో అధిక ఆదాయం
చిన్నశంకరంపేట(మెదక్): అధిక ఆదాయం అందించే ఆయిల్‌పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని ఉద్యాన శాఖ జిల్లా అధికారి ప్రతాప్‌సింగ్ కోరారు. శుక్రవారం నార్సింగి మండల కేంద్రంలోని రైతువేదికలో ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ సాగుతో వరి పంట కన్నా రెండింతల అధిక ఆదాయం పొందవచ్చన్నారు. ఒక ఎకరం వరి సాగుచేసే నీటితోనే ఐదెకరాల ఆయిల్‌పామ్ పంటను సాగు చేయవచ్చని తెలిపారు. సబ్సిడీపై ఆయిల్‌పామ్ మొలకలు అందించడంతో పాటు ఏడాదికి పంటల సాగుకు అవసరమైన ఖర్చులను కూడా ప్రబుత్వం అందిస్తుందని చెప్పారు. సబ్సిడీపై డ్రిప్ సిస్టం అందించడంతో పాటు పంటల సాగుకు సబ్సిడీ అందించనుందని చెప్పారు. ఆయిల్‌పామ్ పంట గెలలను కొనుగోలు చేసేందుకు కంపెనీలతో ముందుగానే ఒప్పందం చేసుకోవడంతో పాటు కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీర్ఘకాలిక అధర్ఘాదాయం పొందేందుకు రైతులు ఆయిల్‌పామ్ పంటలను సాగు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరిఽశోధకులు రంగనాయకులు, మెదక్ డివిజన్ హార్టికల్చర్ అధికారి రచన, నార్సింగి ఏఈ హరిప్రసాద్, ఏఈఓలు విజృంభణ, దివ్య, ఆయిల్‌పామ్ ఫీల్డ్ అసిస్టెంట్ మధు పాల్గొన్నారు.
ఉద్యానశాఖ జిల్లా అధికారి ప్రతాప్‌సింగ్