
సైబర్ నేరగాళ్ల మోసం
● ఆన్‌లైన్ ద్వారా ఫోను కొనుగోలు
● లబోదిమంటున్న బాధితుడు
అక్కన్నపేట(హుస్నాబాద్): ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఆవుల శ్రీనివాస్. అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామం. అయితే, బజాజ్ ఈఎంఐ కార్డును సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి ఆన్‌లైన్ ద్వారా రూ.34వేల విలువల గల ఫోన్‌ను కొనుగోలు చేశారు. గురువారం ఫ్లిప్ కార్డు డెలివరీ బాయ్ ఆ ఫోన్‌ను తీసుకొని ఇంటికి వచ్చాడు. ఆన్‌లైన్ ద్వారా మీరు ఫోన్ కొనుగోలు చేసుకున్నారని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీనివాస్ కంగుతిన్నాడు. తాను ఆన్‌లైన్‌లో ఎలాంటి ఫోన్ కొనుగోలు చేయలేదని ఎంతచెప్పినా ఆర్డర్ క్యాన్సిల్ కాదనడంతో చేసేది లేక ఆ ఫోన్‌ను తీసుకున్నాడు. ఈ క్రమంలో వెంటనే మరో ఫోన్ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్లు, హైదరాబాద్ అడ్రస్‌తో మెసేజ్ రావడంతో శ్రీనివాస్ అవాక్కయ్యాడు. సైబర్ నేరగాళ్లు బజాజ్ కార్డును హ్యాక్ చేసినట్లు గుర్తించి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. కేసు దర్యాప్తులో ఉంది.