
హామీలను తప్పక అమలు చేస్తా
ఎంపీ రఘునందన్‌రావు
రామచంద్రాపురం (పటాన్‌చెరు): ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తానని మెదక్ ఎంపీ ఎం.రఘునందన్‌రావు పేర్కొన్నారు. తెల్లాపూర్ పట్టణ ప్రజల అత్యవసర సేవల కోసం గురువారం ఆయన నూతన అంబులెన్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరిగి సమయంలో సకాలంలో అంబులెన్స్ రాకపోవడంతో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఎన్నికల సమయంలో స్థానిక ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని.. ఇచ్చిన మాట మేరకు అంబులెన్స్ ఇచ్చినట్లు తెలిపారు. తెల్లపూర్ నైబర్ హుడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలలో సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా ఈనెల 26న అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు.