
ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు: నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీలకు సైతం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ రక్షిత మంచినీరు అందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట రెయిన్‌బో మెడోస్ కాలనీలో మంచినీటి నల్ల కనెక్షన్లను గురు వారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఐలాపూర్ గ్రామంలో రూ.పది లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలో ఇటీవల విలీనమైన గ్రామాలలోని కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు.