
సమన్వయంతోనే మెరుగైన వైద్య సేవలు
సంగారెడ్డి: వైద్య కళాశాల, ప్రభుత్వాస్పత్రుల మధ్య సమన్వయంతోనే ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందుతాయని టీఎన్‌జీఓ నేతలు పేర్కొన్నారు. టీఎన్జీవోస్ అధ్యక్షుడు జావిద్‌అలీ ఆ సంఘం నాయకులతో కలిసి సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జయప్రకాశ్‌రావు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణలను బుధవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థుల సమస్యలు, అధ్యాపకుల ఖాళీలు, ప్రయోగశాలల సామగ్రి కొరత, ఆస్పత్రిలో విభాగాల విస్తరణ వంటి అంశాలను చర్చించారు. అనంతరం జయప్రకాశ్‌రావు, మురళీకృష్ణ మాట్లాడుతూ...ప్రభుత్వ రంగ వైద్య వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. సమావేశం టీఎన్‌జీవోస్ జిల్లా కార్యదర్శి రవి, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీకాంత్ వెంకట్‌రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, సుధామిని, విజయ్ పట్టణ శాఖ అధ్యక్షుడు వెంకటేశం, వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
వైద్య కళాశాల ప్రిన్సిపాల్, ఆస్పత్రి
సూపరింటెండెంట్‌లను కలిసిన టీఎన్‌జీఓ నేతలు