
19న ఖేడ్‌కు దామోదర
● కొత్త రేషన్ కార్డుల పంపిణీ ● ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ నెల 19న ఖేడ్ నియోజకవర్గంలో పర్య టించనున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్‌లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఖేడ్ నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను మంత్రి పంపిణీ చేస్తారని సంజీవరెడ్డి వెల్లడించారు. గత పదేళ్లుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు సైతం మంజూరు చేయకపోగా తొలగింపులు, చేర్చడానికి దరఖాస్తులను ఆహ్వానించి తొలగింపులను చేపట్టిందని మండిపడ్డారు. అనేక సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డు ప్రామాణికం కాగా అర్హులైన అనేకమంది పథకాలకు దూరమయ్యారన్నారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులను మంజూరు చేస్తోందన్నారు. నియోజకవర్గంలో కొత్తగా 4 వేల రేషన్ కార్డులు మంజూరు కాగా వాటిలో 10,700 మంది లబ్ధిదారులు ఉన్నారన్నారు. మరో 1,200 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా విచారణ అనంతరం అర్హులకు మంజూరు చేస్తారని తెలిపారు.