అధ్యాపకురాలికి అవార్డు | - | Sakshi
Sakshi News home page

అధ్యాపకురాలికి అవార్డు

Jul 17 2025 8:52 AM | Updated on Jul 17 2025 8:52 AM

అధ్యా

అధ్యాపకురాలికి అవార్డు

నారాయణఖేడ్‌: పట్టణానికి చెందిన అధ్యాపకురాలు మలమంచి శిల్ప నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో టాపర్‌గా నిలిచారు. ఇందుకు గాను ఆమెకు మంగళవారం యూనివర్సిటీలో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ బంగారు పతకంతోపాటు అకాడమీ ఎక్సలెనన్స్‌ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శిల్ప మాట్లాడుతూ అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.

ఓటే వజ్రాయుధం

ఏఎస్పీ మహేందర్‌

హవేళిఘణాపూర్‌(మెదక్‌): ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని జిల్లా ఏఎస్పీ మహేందర్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంజేపీ బాలుర రెసిడెన్షియల్‌ పాఠశాలలో నిర్వహించిన మాక్‌పోలింగ్‌ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. పోలింగ్‌ శాతం తగ్గుతున్న నేటి తరుణంలో విద్యార్థులు ఇలాంటి కార్యక్రమం ద్వారా ఓటు హక్కుపై కనువిప్పు కలిగించడంపై విద్యార్థులు, అధ్యాపకులను అభినందించారు. తాను కూడా ప్ర భుత్వ పాఠశాలలో, హాస్టల్‌లో చదివి అంచెలంచెలుగా ఈ స్థాయికి వచ్చానన్నారు. విద్యార్థు లు ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించా రు. ఎంజేపీ ఆర్‌సీవో గౌతమ్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ సృజన, లైబ్రేరీయన్‌ సంతోశ్‌, సిబ్బంది ఉన్నారు.

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తం

సిద్దిపేట సీపీ అనురాధ

సిద్దిపేటకమాన్‌: సైబర్‌ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ అనురాధ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు మెడికల్‌ షాపు లు, వైన్‌ షాపులు, ఈసేవా కేంద్రాల, హోటళ్ల వద్దకు వచ్చి డబ్బులు అవసరం ఉన్నాయని కమిషన్‌ ఆశ చూపి ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్‌ చేసి నగదు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.అలాంటివారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. పట్టణాలు, గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద మొత్తంలో డబ్బులు అడిగితే డయల్‌ 100కు సమాచారం అందించాలని సూచించారు.

కాటేజీ నిర్మాణానికి

రూ.15 లక్షల విరాళం

కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులు బస చేసేందుకు 100 కాటేజీలు నిర్మించేందుకు చేపట్టిన డోనర్‌ స్కీంకు దాతలు ముందుకొస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని చెప్పల్‌గూడకు చెందిన అందెల నవీన్‌, స్వప్న దంపతులు కాటేజీ నిర్మాణానికి విరాళంగా రూ.15 లక్షల చెక్కును ఆలయంలో ఏఈవో శ్రీనివాస్‌కు అందజేశారు. దాతలు ముందుకొచ్చి విరాళాలు అందజేయాలని ఏఈవో భక్తులను కోరారు. ఆలయ ధర్మకర్తలు లింగంపల్లి శ్రీనివాస్‌, ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్‌, అర్చకులు భాస్కర్‌, ఉద్యోగులు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటాచారి, హైదరాబాద్‌ యాదవసంఘం నాయకులు దుర్గయ్య పాల్గొన్నారు.

మల్లన్న ఆలయపూర్వప్రధానార్చకుడు మృతి

మల్లన్న ఆలయ పూర్వ

ప్రధానార్చకుడు మృతి

కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో గతంలో ప్రధానార్చకులుగా విధులు నిర్వహించిన పడిగన్నగారి మల్లప్ప(82) బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన ఆలయంలో 50 ఏళ్ల పాటు అర్చకునిగా, ముఖ్య, ప్రధానార్చకునిగా సేవలు అందించి 2009లో పదవీ విరమణ పొందారు. మృతుడి కుటుంబాన్ని ఆలయ అధికారులు, ఉద్యోగులు, అర్చకులు, ఒగ్గు పూజారులు పరామర్శించారు.

అధ్యాపకురాలికి అవార్డు
1
1/3

అధ్యాపకురాలికి అవార్డు

అధ్యాపకురాలికి అవార్డు
2
2/3

అధ్యాపకురాలికి అవార్డు

అధ్యాపకురాలికి అవార్డు
3
3/3

అధ్యాపకురాలికి అవార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement