
ఇసుక అక్రమ డంప్ సీజ్
అక్కన్నపేట(హుస్నాబాద్): అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంప్‌పై సిద్దిపేట టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. మండల కేంద్రానికి చెందిన మిడిమలుపుల సాంబరాజు ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వ చేసిన 120టన్నుల అక్రమ ఇసుక డంప్‌ను బుధవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. ఎస్‌ఐ చాతరాజు ప్రశాంత్ మాట్లాడుతూ.. అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను డంప్ చేసి ఎక్కువ ధరకు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడన్న విశ్వసనీయ సమాచారం రావడంతో దాడులు నిర్వహించి ఇసుక డంప్, ట్రాక్టర్‌ను సీజ్ చేశామని తెలిపారు. కానిస్టేబుల్ రాజ్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు పాల్గొన్నారు.