
దర్యాప్తు ముమ్మరం
అనిల్
హత్యపై
కొల్చారం(నర్సాపూర్): గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో సోమవారం రా త్రి మృత్యువాత పడ్డ మండలంలోని పైతర గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మరెల్లి అనిల్ అంత్యక్రియలు బుధవారం ఉదయం స్వగ్రామంలో జరిగాయి. అంత్యక్రియలకు ఆ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశం గౌడ్, స్థానికంగా ఉన్న కొందరు నాయకులు తప్పించి మిగతా నాయకులు ఎవరూ హాజరు కాలేదు. గత ఏడాది జూలై 16న పుట్టినరోజు కార్యక్రమం సందర్భంగా తండ్రి చేత కేక్ తినిపించుకొని ఉల్లాసంగా గడిపిన అనిల్, ఇదే రోజున తండ్రి చేత తలకొరివి పెట్టించుకోవడం అంత్యక్రియలకు హాజరైన వారిని కంటతడి పెట్టించింది.
విచారణ వేగవంతం
అనిల్ హత్య ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. బృందాలుగా ఏర్పడ్డ పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. అంత్యక్రియలకు ముందు ఎస్‌ఐ మహమ్మద్ గౌస్ అనిల్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అతని మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. కాల్ డేటా ఆధారంగా దర్యాప్తులో ముందుకు సాగుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇంటి నుంచి అనిల్ కారులో బయలుదేరిన సమయం నుంచి హత్య జరిగిన ఘటనా స్థలికి వచ్చిన ప్రదేశం వరకు మండలంలో దారి పొడవున ఉన్న అన్ని సీసీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో ఆయన వెంట ప్రతిరోజు తిరిగే స్నేహితులు, అనుచరులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
స్వగ్రామం పైతరలో అంత్యక్రియలు
మండలంలో సీసీ కెమెరాల పరిశీలన
అనిల్ మొబైల్ ఫోన్ ఆధారంగా విచారణ
ఆయన అనుచరులనువిచారిస్తున్న పోలీసులు!
ఇన్‌స్ట్రాగామ్‌లో అనిల్ వీడియోలు వైరల్
మండలంలో ఏ వ్యక్తి మొబైల్‌లో చూసినా అనిల్‌కు సంబంధించిన ‘మరెల్లి అనిల్... మౌర్య ‘ పేరిట ఇన్‌స్ట్రాగామ్‌లో వివిధ సందర్భాల్లో అప్‌లోడ్ చేసిన అతడి వీడియోలు వైరల్‌గా మారాయి.

దర్యాప్తు ముమ్మరం