భూ సమస్య పరిష్కరించాలని రైతు నిరసన | - | Sakshi
Sakshi News home page

భూ సమస్య పరిష్కరించాలని రైతు నిరసన

Jul 17 2025 8:52 AM | Updated on Jul 17 2025 8:52 AM

భూ సమస్య పరిష్కరించాలని రైతు నిరసన

భూ సమస్య పరిష్కరించాలని రైతు నిరసన

● నివేదిక తప్పుగా పంపించారని ఆగ్రహం ● న్యాయం జరగకపోతేఆత్మహత్యే శరణ్యం

అక్కన్నపేట(హుస్నాబాద్‌): భూ సమస్యను పరిష్కరించాలని తండ్రీకొడుకులు నిరసన చేపట్టారు. ఈ ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మండలంలోని గోవర్ధనగిరి గ్రామానికి చెందిన చిల్పూరి ఎల్లారెడ్డి, అతని కుమారుడు మహేందర్‌రెడ్డి భూ సమస్యను పరిష్కరించాలని తహసీల్దార్‌కు చాలా రోజులుగా విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా సమస్యను పరిష్కరించకుండా తీవ్ర ఆలస్యం చేస్తున్నారని బుధవారం తండ్రి, కొడుకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పైసా పైసా కూడ బెట్టుకొని కొనుగోలు చేసిన 20 ఎకరాల భూమిని సాగు చేస్తూ వస్తున్నామని తెలిపారు. ఎవరో చెప్పారని ఆ భూమిని ఆన్‌లైన్‌లో కనిపించకుండా రెవెన్యూ అధికారులు తొలగించారని కంటతడి పెట్టుకున్నారు.

విషయం రైతు కమిషన్‌ చైర్మన్‌ వద్దకు..

ఇటీవల సిద్దిపేట జిల్లా ప్రజావాణిలో భూ బాధితుడు ఎల్లారెడ్డి భూ సమస్యతో విసుగొచ్చి ఓ కవర్‌లో డీజిల్‌ను వెంట తీసుకొని వెళ్లాడు. గమనించిన పోలీసులు అడ్డుకొని బయటకు పంపించారు. ఈ క్రమంలో రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి భూ బాధితుడు ఎల్లారెడ్డి, తహసీల్దార్‌ అనంతరెడ్డిలను హైదరాబాద్‌కు పిలిపించుకొని మాట్లాడి భూ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అయినా భూ సమస్యను పరిష్కరించకుండా ఉన్నతాధికారులకు నివేదికను తప్పుగా పంపించారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. న్యాయం జరగకపోతే తమ కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమని కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషయంపై తహసీల్దార్‌ అనంతరెడ్డిని వివరణ కోరగా... భూ సమస్యపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించామని, రైతు అడిగిన సమాచారాన్ని ఇచ్చామని తెలిపారు. భూ వివాదం కోర్టు కేసులో ఉందని, ఈ విషయంలో మేము ఏం చేయలేమని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement