
మొక్కజొన్నకు కత్తెర పురుగు
ఆదిలోనే చీడపీడలతో
పంటలకు నష్టం
● మందులు పిచికారీ చేసినా చావని పురుగు
● ఆందోళన చెందుతున్న రైతులు
● పట్టించుకోని వ్యవసాయ అధికారులు
ఈ ఫొటోలో కన్పించే మహిళా రైతు పొన్నబోయిన చిలుకవ్వ మీర్జాపూర్‌లో రెండెకరాల్లో మొక్కజొన్న, ఎకరంలో కూరగాయలు సాగు చేస్తుంది. మరో ఎకరం వరి సాగుకు నారు పోసి సిద్ధం చేసింది. మొక్కజొన్న చేనుకు కత్తెర పురుగు (మొగ్గి) రావడంతో తీరొక్క మందులు తెచ్చి పిచికారీ చేసిన పురుగు పోకపోవడంతో ఆమె ఆందోళన చెందుతుంది.