
వేర్వేరు చోట్లముగ్గురు అదృశ్యం
పెద్దశంకరంపేట(మెదక్): మండల కేంద్రానికి చెందిన తల్లీకూతురు అదృశ్యమయ్యారు. ఈ ఘటన ఇటీవల చోటుచేసుకుంది. ఎస్‌ఐ.ప్రవీణ్‌రెడ్డి వివరాల ప్రకారం... పేటకు చెందిన చీలాపల్లి రేణుక, సాయిలు దంపతులు. వీరికి ఐదేళ్ల కూతురు మయూరి ఉంది. వీరు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇటీవల వీరు పీర్ల పండుగ సందర్భంగా మండలానికి వచ్చి తిరిగి ఈ నెల 9న హైదరాబాద్‌కు వెళ్లారు. అనంతరం సాయిలు భార్య, కూతురు కనిపించడం లేదని రేణుక తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సిద్దిపేట పట్టణంలో..
సిద్దిపేటకమాన్: వ్యక్తి అదృశ్యమైన ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. వన్ టౌన్ సీఐ వాసుదేవరావు వివరాల ప్రకారం..పట్టణంలోని రేణుకానగర్‌కు చెందిన ఆకునూర్ బాల్‌నర్సయ్య (66) స్థానికంగా ఉన్న ఓ టింబర్‌డిపోలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు సోమవారం పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. ఉదయం భార్య రాజవ్వకు చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేశారు.