
భూ భారతితో రైతుకు న్యాయం
మునిపల్లి(అందోల్): కంకోల్ గ్రామానికి చెందిన రైతు మడప్పకు భూ భారతితో న్యాయం జరిగింది. వివరాలు ఇలా... గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్‌లో తప్పిదం వల్ల మడప్ప 5 ఎకరాల భూమి వెరే రైతుపై నమోదైంది. దీంతో తన భూమి వేరే రైతుపై తప్పుగా పడిందని, భూమి రికార్డులు చూసి తన పేరుపైకి మార్చాలని తహసీల్దార్, కలెకర్ట్ కార్యాలయం చుట్టూ ఆరేళ్లుగా తిరిగాడు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో హైదరాబాద్‌లోని సీసీఎల్ కార్యాలయం చుట్టూ తిరిగి పాత రికార్డుల ప్రకారం తన 5 ఎకరాలకు సంబంధించి అధికారుల ద్వారా తన పేరిట పాస్‌బుక్‌లు తీసుకున్నాడు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో రైతు సమైక్య జిల్లా అధ్యక్షుడు పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ గంగాభవానిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంగన్న, మల్లికార్జున్ శెట్టి, రెవెన్యూ అధికారి జైపాల్, శేఖర్, రాజు, ఈశ్వర్‌రెడ్డి, వీరన్న, రాంరెడ్డి, నారాయణ రెడ్డి పాల్గొన్నారు.
ఎట్టకేలకు రైతు పేరిట పాస్‌బుక్‌లు