
మున్సిపాలిటీ వద్దే వద్దు
జిన్నారం (పటాన్‌చెరు): జిన్నారం మున్సిపాలిటీ ఏర్పాటుతో ప్రభుత్వం రైతుల నుంచి అసైన్డ్ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుందని మండలంలోని రాళ్లకత్వ గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. పూర్తి రైతు ఆధారిత ప్రాంతమైన జిన్నారంను మున్సిపాలిటీగా మారిస్తే ఈ ప్రాంత ప్రజలు, రైతులకు భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద రైతులు సాగు చేసుకునేందుకు ఇచ్చిన ప్రభుత్వ భూములను తిరిగి తీసుకునే ప్రయత్నంలో భాగంగా సర్వే నంబర్ 286 రైతులకు నోటీసులు జారీ చేసిందన్నారు. మా అభిప్రాయాలు తెలుసుకోకుండా మున్సిపాలిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు.
గురు పౌర్ణమికి ముస్తాబు
హత్నూర(సంగారెడ్డి): మండల కేంద్రమైన హత్నూర మధుర గ్రామ శివారులోని దత్తాచల క్షేత్రంలో గురు పౌర్ణమి వేడుకలను మంగళవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు క్షేత్రాధిపతి సభాపతిశర్మ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. వేడుకలకు మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజిరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు.
‘భగీరథ’ నీటిలో
వానపాములు
నర్సాపూర్: మిషన్ భగీరథ నీరు కలుషితం అవుతోందని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో నల్లాల ద్వారా చేప పిల్లలు రాగా, సోమవారం పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీలోని కొందరి ఇళ్లకు నల్లాల ద్వారా సరఫరా అయిన నీటిలో వానపాములు, ఇసుక వచ్చినట్లు తెలిపారు. మిషన్ భగీరథ పథకం ద్వారా శుద్ధి చేసిన నీరు రావాల్సి ఉండగా, కలుషిత నీరు రావడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఆ జీఓను ఉపసంహరించుకోవాలి
రామాయంపేట(మెదక్): ఎనిమిది గంటల పనిదినాన్ని పది గంటలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ రామాయంపేటలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం నిరసన తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షురాలు బాలమణి ఆధ్వర్యంలో కార్మికులు అంబేడ్కర్ విగ్రహం వద్ద జీఓ ప్రతులు పట్టుకొని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం జీఓ ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ప్రభుత్వం బేషరతుగా ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్‌ఈ నారాయణనాయక్ బాధ్యతల స్వీకరణ
మెదక్ కలెక్టరేట్: జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్‌ఈ)గా నారాయణనాయక్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఎస్‌ఈ శంకర్ గత నెలలో ఉద్యోగ విరమణ చేశారు. హైదరాబాద్‌లో విద్యుత్ శాఖ ఎస్‌ఈగా విధులు నిర్వర్తిస్తున్న నారాయణ నాయక్ జిల్లాకు నూతనంగా నియమితులయ్యారు. ఈసందర్భంగా జిల్లాలోని డివిజనల్ ఇంజినీర్లు, ఏడీఈలు, ఏఈలు, అధికారులు, సిబ్బంది ఎస్‌ఈకి స్వాగతం పలికారు. నూతన ఎస్‌ఈ మాట్లాడుతూ.. విద్యుత్ శాఖకు సంబంధించి అధికారులు, సిబ్బంది, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.

మున్సిపాలిటీ వద్దే వద్దు

మున్సిపాలిటీ వద్దే వద్దు

మున్సిపాలిటీ వద్దే వద్దు

మున్సిపాలిటీ వద్దే వద్దు