
అర్జీలను పెండింగ్‌లో పెట్టొద్దు
సంగారెడ్డి జోన్: ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ప్రావిణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మాధురితో కలిసి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను అర్జీదారులకు వివరించాలన్నారు. ఇదిలాఉండగా రామచంద్రాపురం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న తమకు గత నాలుగు నెలలుగా వేతనాలతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్ అమలు కావటం లేదని ఉద్యోగులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వేతనాలు సమయానికి రాకపోవటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు చర్యలు తీసుకొని తమకు వేతనాలు ఇప్పించాలని కోరారు. అనంతరం జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. మహిళా సంఘాలు మంచి లాభాలు వచ్చే వ్యాపారాలు నిర్వహించి, ఆర్థిక అభివృద్ధి సాధించాలని సూచించారు. త్వరలో మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను అందిస్తామన్నారు. అలా గే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనులు వేగవంతం అయ్యేలా చూడాలని ఆదే శించారు. సమావేశంలో డీఆర్డీఏ జ్యోతి, అడిషనల్ డీఆర్డీఓ సూర్యరావు, జిల్లా సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రావిణ్య
ప్రజావాణికి 46 వినతులు
ఓపెన్ స్కూల్ వరం
సంగారెడ్డి ఎడ్యుకేషన్: చదువు మద్యలో మానేసిన వారికి ఓపెన్ స్కూల్ వరం లాంటిదని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. సోమవారం ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్లు రెగ్యులర్ సర్టిఫికెట్లతో సమానమన్నారు. ఈనెల 11 వరకు అడ్మిషన్లకు గడువు ఉందని వెల్లడించారు.