
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దాం
తూప్రాన్: కార్మికుల సమస్యల సాధన కోసం ఈనెల 9న చేపట్టే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు విష్ణు పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలో కార్మిక సంఘాల నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. తమ సమస్యల సాధన కోసం ప్రతి కార్మికుడు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు ఆనంద్, మల్లేష్, నాగులు, భిక్షపతి, శ్రీనివాస్, నారాయణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.