
సింగూరు జలాలను విడుదల చేయాలి
బీకేఎస్ అధ్యక్షుడు నరసింహారెడ్డి
సంగారెడ్డి టౌన్: సింగూరు జలాలను వెంటనే విడుదల చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి అన్నారు. సోమవారం సంగారెడ్డిలో రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంట ఖర్చులు పెరగడంతో చెరకు పంటకు టన్నుకు రూ.500 చెల్లించాలని, జొన్నలు కొనుగోలు డబ్బులు వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లోని విద్యుత్ సమస్యలను తీర్చాలన్నారు. సమావేశంలో జిల్లా కోశాధికారి సదానంద రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి తదిరులు పాల్గొన్నారు.
సీఐ విద్యాసాగర్‌కు
సేవా పతకం
సిద్దిపేటకమాన్: సిద్దిపేట త్రీ టౌన్ పోలీసు స్టేషన్ సీఐ విద్యాసాగర్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2025 అతిఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికై నట్లు సీపీ అనురాధ తెలిపారు. ఈ మేరకు పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీఐని సోమవారం ఆమె అభినందించారు. ఎలాంటి రిమార్క్ లేకుండా పోలీసు శాఖలో 25 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న విద్యాసాగర్ ఈ పథకావడం గర్వకారణమన్నారు. త్వరలోనే ఈ పతకం అందజేస్తామన్నారు. ప్రతిభ కనబరిచే అధికారులు, సిబ్బందిని గుర్తించి అవార్డులు, రివార్డులు, సేవా పతకాలు ఇస్తామన్నారు.
తండ్రి మందలించారని..
తొమ్మిదో తరగతి విద్యార్థి అదృశ్యం
హత్నూర( సంగారెడ్డి): తండ్రి మందలించడంతో తొమ్మిదో తరగతి విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన హత్నూర పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని మంగాపూర్‌కు చెందిన గడ్డమీది వీరేశం, నిర్మల దంపతుల పెద్ద కుమారుడు అభిరాం దౌల్తాబాద్ లో 9వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం రాత్రి ఆలస్యంగా రావడంతో తండ్రి వీరేశం మందలించాడు. సోమవారం తెల్లవారుజామున అభిరాం ఇంట్లో నుంచి వెళ్లిపోయి సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసినవారు 83309 07363, 96528 87845, 97014 68493 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కుటుంబీకులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు.
కుక్కల దాడిలో జింక హతం
రామాయంపేట(మెదక్): దారి తప్పి అటవీప్రాంతం నుంచి గ్రామంలోకి వచ్చిన చుక్కల జింకను సోమవారం మండలంలోని లక్ష్మాపూర్ వద్ద కుక్కలు హతమార్చాయి. ఈ విషయమై గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. డిప్యూటీ రేంజ్ అధికారి ఖుద్బుద్దీన్ సంఘటనా స్థలిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. పశువైద్యుడు పోస్టుమార్టం నిర్వహించారు.

సింగూరు జలాలను విడుదల చేయాలి

సింగూరు జలాలను విడుదల చేయాలి