
వృద్ధురాలి మెడలో పుస్తెల తాడు తస్కరణ
చేర్యాల(సిద్దిపేట): బైక్‌పై తీసుకెళ్తానని నమ్మించి వృద్ధురాలి మెడలోంచి పుస్తెల తాడు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన మండల పరిధిలోని తాడూరు క్రాస్‌రోడ్డు సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. తాడూరు గ్రామానికి చెందిన ఈరు సత్తమ్మ, యాదయ్య దంపతులు దైవదర్శనం నిమిత్తం మర్కూక్ వెళ్లి వచ్చే క్రమంలో తాడూరు క్రాస్‌రోడ్డు వద్ద బస్సు దిగారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై భర్త వెళ్లగా అక్కడే ఉన్న సత్తమ్మను అటుగా ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు నమ్మించి బైక్‌పై ఎక్కించుకున్నారు. కొద్దిదూరం వెళ్లాక బండి ఆపి వృద్ధురాలి మెడలోంచి పుస్తెల తాడు లాక్కుని వెళ్లారు. ఈ క్రమంలో సత్తమ్మ మెడకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నవీన్ తెలిపాడు.